నా ఆరోగ్యం క్షీణిస్తోంది... బెయిలివ్వండి

ABN , First Publish Date - 2020-07-14T07:51:17+05:30 IST

భీమా-కోరేగావ్‌ కేసులో నిందితుడైన ప్రముఖ కవి వరవరరావు(79) తాత్కాలిక బెయిలు కోసం బాంబే హైకోర్టును

నా ఆరోగ్యం క్షీణిస్తోంది... బెయిలివ్వండి

  • బాంబే హైకోర్టులో వరవరరావు రెండు వ్యాజ్యాలు


ముంబై, జూలై 13: భీమా-కోరేగావ్‌ కేసులో నిందితుడైన ప్రముఖ కవి వరవరరావు(79) తాత్కాలిక బెయిలు కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, దానికితోడు కొవిడ్‌ మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో తనకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరారు. వరవరరావు తరఫున ఆయన న్యాయవాది ఆర్‌ సత్యనారాయణ్‌ అయ్యర్‌ హైకోర్టులో సోమవారం రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇవి ఈ వారంలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది.   


వరవరరావును విడుదల చేయించండి: సీపీఐ రామకృష్ణ

మహారాష్ట్ర ప్రభుత్వంతో తక్షణమే సంప్రదింపులు జరిపి జైల్లో ఉన్న విరసం నేత వరవరరావును బెయిల్‌పైగానీ, పెరోల్‌పైగానీ విడుదల చేయించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌లను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈమేరకు వారిద్దరికీ లేఖలు రాసినట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2020-07-14T07:51:17+05:30 IST