డిసెంబర్ 14 వరకూ వరవరరావును నానావతి ఆస్పత్రిలోనే ఉంచాలి: ముంబై హైకోర్టు

ABN , First Publish Date - 2020-12-04T03:21:23+05:30 IST

విరసం నేత వరవరరావు ఆరోగ్యంపై ముంబై కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 15వరకు వరవరరావును నానావతి ఆస్పత్రిలోనే ఉంచాలని...

డిసెంబర్ 14 వరకూ వరవరరావును నానావతి ఆస్పత్రిలోనే ఉంచాలి: ముంబై హైకోర్టు

ముంబై: విరసం నేత వరవరరావు ఆరోగ్యంపై ముంబై కోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 14 వరకు వరవరరావును నానావతి ఆస్పత్రిలోనే ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. వరవరరావు ఆరోగ్య నివేదికను ఆస్పత్రి సూపరింటెండెంట్ కోర్టుకు అందించారు. నివేదికపై విచారణ జరపాలని వరవరరావు తరపు న్యాయవాదులు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వరవరరావు హెల్త్‌ రిపోర్ట్ తమకు అందలేదని ఎన్ఐఏ కోర్టుకు నివేదించింది. కుటుంబ సబ్యులకు తెలియకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. వీవీ ఆరోగ్యంపై ఇచ్చిన నివేదికపై డిసెంబర్ 15న విచారిస్తామని ముంబై హైకోర్టు తెలిపింది. అప్పటి వరకు వరవరరావును ఆస్పత్రిలోనే ఉంచాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. ముంబై హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది.

Updated Date - 2020-12-04T03:21:23+05:30 IST