ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు

ABN , First Publish Date - 2021-02-26T01:46:57+05:30 IST

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ముంబైలోని ఆయన ఇంటికి సమీపంలో ఆపి ఉన్న ఓ వాహనంలో పేలుడు పదార్థాలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది గుర్తించారు

ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు

ముంబై: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ముంబైలోని ఆయన ఇంటికి సమీపంలో ఆపి ఉన్న ఓ వాహనంలో పేలుడు పదార్థాలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది గుర్తించారు. ఇంటికి సమీపంలో గురువారం ఓ వాహనం ఆగి ఉంది. అనుమానంతో ముఖేష్ అంబానీ వ్యక్తిగత సిబ్బంది తనిఖీ చేశారు. కాగా, ఆ వాహనంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే స్థానిక పోలీసులతో చేరవేశారు. వారు బాంబు నిర్వీర్య బృందాలను అక్కడికి పంపాయి. ఆ వాహనం ఎక్కడిది? అక్కడికి ఎలా వచ్చింది? ఎవరిది? అనే విషయాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-02-26T01:46:57+05:30 IST