Abn logo
Mar 5 2021 @ 06:16AM

తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు

ఉత్తిదేనని తేల్చిన భద్రతాసిబ్బంది.. పోలీసుల అదుపులో నిందితుడు


న్యూఢిల్లీ, మార్చి 4 : ఆగ్రాలోని తాజ్‌మహల్‌లో బాంబు పెట్టినట్టు గురువారం బెదిరింపు ఫోన్‌ కాల్‌ రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పర్యాటకులను వెంటనే అక్కడి నుంచి ఖాళీచేయించారు.  ఫోన్‌ చేసిన విమల్‌కుమార్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  తాజ్‌మహల్‌లో బాంబు ఉన్నట్టు   గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో విమల్‌కుమార్‌ సింగ్‌ ఫోన్‌చేశాడని ఆగ్రా జోన్‌ డీజీపీ సతీశ్‌ గణేశ్‌ మీడియాకు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది చారిత్రక కట్టడంలో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించకపోవడంతో భద్రతా సిబ్బంది ఊపిరి తీసుకున్నారు. సుమారు గంటా 45 నిమిషాల తనిఖీల తర్వాత పర్యాటకులను లోనికి అనుమతించారు. కాగా, నిందితుడు  విమల్‌కుమార్‌ సింగ్‌ మానసిక పరిస్థితి సరిగాలేదని పోలీసులు చెబుతున్నారు.  

Advertisement
Advertisement
Advertisement