బాంబు బెదిరింపు కాల్‌..

ABN , First Publish Date - 2022-05-17T05:37:57+05:30 IST

కరీంనగర్‌లోని సౌత్‌ ఇండియా, మాంగళ్య షాపింగ్‌ మాల్స్‌లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఆ మాల్స్‌ యజమానులకు ఫోన్‌చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.

బాంబు బెదిరింపు కాల్‌..
డాగ్‌, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్న పోలీసులు

- షాపింగ్‌ మాల్స్‌లో తనిఖీ చేసిన పోలీసులు

కరీంనగర్‌ క్రైం, మే 16: కరీంనగర్‌లోని సౌత్‌ ఇండియా, మాంగళ్య షాపింగ్‌ మాల్స్‌లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఆ మాల్స్‌ యజమానులకు ఫోన్‌చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు షాపింగ్‌ మాల్స్‌లో బాంబు, డాగ్‌ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, బాంబులు లభించలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయిల పనిగా పోలీసులు పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన మాల్స్‌లన్నింటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. షాపింగ్‌ మాల్స్‌కు ఫోన్‌చేసి బాంబు పెట్టామని బెదిరింపులకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాల్‌ డాటా ఆధారంగా ఆ వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. తనిఖీల్లో కరీంనగర్‌ సిటీ ఏసీపీ తుల శ్రీనివాసరావు, ఒకటో ఠాణా సీఐ నటేశ్‌, బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ పోలీసులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:37:57+05:30 IST