Abn logo
Jun 21 2021 @ 23:40PM

ఏజెన్సీలో బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాల తనిఖీ

అటవీ ప్రాంతంలో రోడ్లు, కల్వర్టుల వద్ద తనిఖీలు చేస్తున్న ప్రత్యేక బృందాలు

బుట్టాయగూడెం, జూన్‌ 21: పశ్చిమ ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లోని రహదారు లు, కల్వర్టులు, వంతెనల వద్ద ఏలూరు నుంచి వచ్చిన బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్య నేతలు పర్యటించే ప్రాంతాల్లో రెండు రోజులుగా బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత పశ్చిమ ఏజెన్సీలో తనిఖీలను ముమ్మరం చేశారు. సోమవారం దుద్దుకూరు, దొరమామిడి అటవీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. దుద్దుకూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వాహనాన్ని బృందాలు తనిఖీ చేసిన తర్వాతనే బయటకు వెళ్లేందుకు అనుమతించారు. తర్వాత అనుమానిత ప్రాంతా ల్లోనూ జల్లెడ పట్టారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఎవరినీ వదలడం లేదు.

దుద్దుకూరులో ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేస్తున్న బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందం