Abn logo
Aug 9 2020 @ 16:39PM

నెపోటిజంపై శిల్పాశెట్టి కీలక వ్యాఖ్యలు

ముంబై: బాలీవుడ్‌ను ప్రస్థుతం కుదిపేస్తున్న అంశం నెపోటిజం. సుశాంత్ మరణం తరువాత అనేక మంది నటీనటులు తాముకూడా నెపోటిజం బాధితులమంటూ తెరపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి శిల్పాశెట్టి కీలక వ్యఖ్యలు చేశారు. విధిరాత కంటే నెపోటిజం గొప్పదేమీ కాదని శిల్పా అన్నారు. విధిని తాను కచ్ఛితంగా విశ్వసిస్తానని, అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. ‘నా కుటుంబానికి ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. కానీ కృషి, పట్టుదలతో ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. విధి కారణంగానే మనమందరం ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. పట్టుదలతో పాటు ప్రతిభ కూడా ఉండాలి. చేరుకోవలసిన గమ్యం కోసం శాయశక్తుల ప్రయత్నించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం కోసం పట్టుదలతో పోరాడాలి. అప్పుడు మనం సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ అడ్డకోలేర’ని శిల్పా శెట్టి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement