సినిమాల్లో నటించేవారు వెండితెరపై కనిపించడంతో పాటు బుల్లి తెరపై కూడా హోస్ట్, జడ్జీలుగా సందడి చేస్తుంటారు. షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, చిరంజీవి, నాగార్జున, ప్రియమణి, రేణుదేశాయ్ తదితరులెందరో బుల్లి తెరపై కూడా కనిపించారు. ఒక షోలో జడ్జీగా వ్యవహరించిన హీరోయిన్‌కి అనుకోని అనుభవం ఎదురైంది. ఆ అనుభవం గురించి అడగగా ఆమె స్పందించింది.
గబ్బర్ సింగ్ చిత్రంలో ‘‘కెవ్వుకేక’’ పాటలో కనిపించి కుర్రకారు మదిని దోచిన భామ మలైకా అరోరా. డ్యాన్స్ రియాలిటీ షో అయిన ‘‘ ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ ’’ కు ఆమె జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ షో రెండో సీజన్ తాజాగా ప్రారంభమైంది. ఆమె మొదటి సీజన్‌కు కూడా జడ్జీగా చేసింది. ఆ సమయంలో ఒక కంటెస్టెంట్ వచ్చి ఆమె బుగ్గలను తాకాడు. ‘‘ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ ’’ రెండో సీజన్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆ సంఘటన గురించి హోస్ట్ అడిగారు. దీంతో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఆమె ఆ సంఘటన గురించి స్పందిస్తూ ‘‘ నేను జడ్జి సీటులో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా కంటెస్టెంట్ వచ్చి బుగ్గలను తాకాడు. అప్పుడు కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను భయపడిపోయాను. అతడు ప్రేమతో ఆ పని చేశాడని నాకు తెలుసు. కానీ, ఆ క్షణంలో నాకు భయమేసింది. అతడు చేతులను సానిటైజ్ చేసుకున్నాడా లేడా అనే ఆలోచనలో నేను పడిపోయాను ’’ అని చెప్పింది.
‘‘ ఆమె చాలా పెద్ద సెలెబ్రిటీ. ఎవరు వెళ్లి నేరుగా ఆమె బుగ్గలను తాకుతారు? నాకు అయితే అంత దైర్యం లేదు. అకస్మాత్తుగా అతడు ఆ పని చేశాడు ’’ అని ఆ షోకు మరో జడ్జీగా వ్యవహరించిన టెరెన్స్ లూయిస్ చెప్పారు. మలైకాకు గత ఏడాది కరోనా సోకింది. ఫలితంగా తన ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు.