తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన `మాస్టర్` సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. షూటింగ్ పూర్తయిపోయినప్పటికీ సినిమా థియేటర్ల విషయంలో సందిగ్ధత నెలకొనడంతో విడుదల విషయంలో చిత్ర యూనిట్ ధైర్యంగా ముందడుగు వేయలేకపోతోంది. ఈ సినిమా విడుదల సంగతి పక్కన పెడితే విజయ్ 65వ సినిమా గురించి ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనేను, విలన్‌గా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంను తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం వీరితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోందట.