సౌదీ అరేబియాలో సల్మాన్ ఖాన్‌కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2022-01-31T14:05:46+05:30 IST

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్‌కు సౌదీ అరేబియాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సౌదీ ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సల్మాన్ వె

సౌదీ అరేబియాలో సల్మాన్ ఖాన్‌కు అరుదైన గౌరవం

ఎన్నారై డెస్క్: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్‌కు సౌదీ అరేబియాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సౌదీ ప్రభుత్వం ఆయనను గౌరవించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సల్మాన్ వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సౌదీ అరేబియా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ తాజాగా జాయ్ అవార్డ్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు నటీనటులకు అవార్డులతో సత్కరించింది. ఇందులో భాగంగానే సల్మాన్ ఖాన్‌కు ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా భాయ్‌‌జానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. అవార్డు అందుకుంటున్న ఫొటోను షేర్‌ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 




Updated Date - 2022-01-31T14:05:46+05:30 IST