రుహాని శర్మకు బాలీవుడ్ ఆఫర్..

యంగ్ హీరోయిన్ రుహాని శర్మకు బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు తాజా సమాచారం. 'చి.ల.సౌ' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రుహాని శర్మ మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత విశ్వక్ సేన్ సరసన 'హిట్', అలాగే ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన 'డర్టీ హరి', అవసరాల శ్రీనివాస్ సరసన '101 జిల్లాల అందగాడు' వంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీకి హిందీ సినిమాలో అవకాశం వచ్చిందట. బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసై హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో దేవాంగ్ భవసార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమా కోసం పలువురు మోడల్స్, హీరోయిన్స్‌ను పరిశీలించిన చిత్రబృందం ఫైనల్‌గా రుహాని శర్మను ఎంపిక చేసుకున్నారట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సౌత్ నుంచి వెళ్ళిన స్టార్ హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక మందన్న, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ వరుస అవకాశాలు అందుకుంటూ బాగానే రాణిస్తున్నారు. మరి రుహానీ వీరి జాబితాలో నిలుస్తుందో లేదో చూడాలి.  

Advertisement