Jun 8 2021 @ 13:50PM

'ఆది పురుష్'కి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్..?

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ మూవీ 'ఆది పురుష్'. దీనికి బాలీవుడ్ సంగీత ద్వయం సాచెత్ తాండన్ - పరంపరా ఠాకూర్ మ్యూజిక్ అందిస్తున్నారని బీటౌన్ మీడియాలో ప్రచారమవుతోంది. వీరు ఇంతకముందు ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన 'తన్హాజీ'కి సంగీతమందించారు. డైరెక్టర్‌తో వీరికి మంచి రాపో ఉందట. అలాగే ప్రభాస్ నటించిన సాహోలోని 'సైయాన్ సైకో' పాటను అందించారు. ఈ రకంగా ప్రభాస్‌తోనూ మంచి బాండింగ్ ఉంది. అందుకే 'ఆది పురుష్‌'కి సంగీతం అందించే బాధ్యతలను సాచెత్ తాండన్ - పరంపరా ఠాకూర్‌లకు అప్పగించినట్టు తెలుస్తోంది. 

రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తుండగా, టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్  భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.