అంచనాలను అందుకునేలా

ABN , First Publish Date - 2021-02-14T08:48:32+05:30 IST

త్వరలోనే ‘నాగిని’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నామని చెప్పారు బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌. ఈ చిత్రంలో నాగినిగా ఆమె టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘నాగిని’ చిత్రం

అంచనాలను అందుకునేలా

త్వరలోనే ‘నాగిని’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నామని చెప్పారు బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌. ఈ చిత్రంలో నాగినిగా ఆమె టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘నాగిని’ చిత్రం ప్రకటించాక ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చాలా సంతోషం కలిగించింది. ఈ చిత్రంపై వారు చూపించిన ఆసక్తి మా బాధ్యతను మరింత పెంచింది. ప్రేక్షకుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రం రూపొందిస్తాం. ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని శ్రద్ధ చెప్పారు. మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విశాల్‌ ఫ్యూరియా దర్శకత్వం వహిస్తున్నారు. శాఫ్రాన్‌ బ్రాడ్‌కాస్ట్‌ అండ్‌ మీడియా లిమిటెడ్‌ బేనర్‌లో నిఖిల్‌ ద్వివేది నిర్మిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని ప్రకటించారు.‘‘నా బాల్యంలో శ్రీదేవి మేడమ్‌ నాగినిగా నటించిన సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయాలనుకునేదాన్ని. ఇప్పుడు ‘నాగిని’ చిత్రంతో ఆ కోరిక తీరుతోంది. తెరపై నాగిని పాత్రను పోషించడం ఓ గౌరవంగా భావిస్తున్నాను’’ అని ఆ సందర్భంలో శ్రద్ధాకపూర్‌ చెప్పారు.

Updated Date - 2021-02-14T08:48:32+05:30 IST