Abn logo
Apr 3 2020 @ 09:14AM

బాలీవుడ్ భామ‌ల‌తో మ‌హేశ్‌..?

మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. పరుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో న‌టించ‌బోయే హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కొన్నిరోజుల ముందు వ‌ర‌కు కీర్తి సురేశ్ న‌టించే అవ‌కాశాలున్నాయంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌హేశ్‌తో బాలీవుడ్ హీరోయిన్స్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. ముఖ్యంగా కియారా అద్వానీతో పాటు సారా ఆలీఖాన్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. చివ‌ర‌కు మ‌హేశ్ స‌ర‌స‌న న‌టించేదెవ‌రో తెలియాలంటే వెయిటింగ్ చేయ‌క త‌ప్ప‌దు మ‌రి.

Advertisement
Advertisement
Advertisement