బాలీవుడ్లో బోల్డ్ పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న నటి మల్లికా శెరావత్. ఇమ్రాన్ హష్మీ హీరోగా తెరకెక్కిన మర్డర్ సినిమా ఆమెకు ఎంతగానో పేరు తీసుకువచ్చింది. అతడితో మల్లికా శెరావత్ తెర మీద చేసిన రొమాన్స్ అప్పట్లో బీటౌన్‌లో సంచలనం సృష్టించింది. తాజాగా ఆమె ఒక షోలో పాల్గొంది. బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బీ టౌన్ డర్టీయెస్ట్ సీక్రెట్స్ వెల్లడించింది.
మందిరా బేడీ హోస్ట్‌గా వ్యవహరించే ‘‘లవ్, లాఫ్, లివ్’’ షోలో ఆమె పాల్గొంది. బాలీవుడ్ నటులు, నిర్మాతల డర్టీయెస్ట్ సీక్రెట్స్ వెల్లడించింది. తనకు, తన సహనటులకు ఇగోతో అనేక గొడవలు జరిగేవని ఆమె చెప్పింది. ‘‘నా నుంచి గుడ్ మార్నింగ్‌ను వారు ఆశించేవారు. తలను కిందకి దించి ఉంచాలనుకునేవారు. కానీ, అది నా వ్యక్తిత్వం కాదు. నేను హర్యనాకీ చెందిన జాట్ని. ఎవరి ముందు తలను దించేదాన్ని కాదు. మర్డర్ సినిమా ప్రమోషన్ సమయంలో నాకు, ఇమ్రాన్ హష్మీకీ మధ్య చాలా గొడవలు జరిగాయి. ఆ సమయంలో నేను చిన్న పిల్లలా ప్రవర్తించాను. నిజం చెప్పాలంటే ఇమ్రాన్ హష్మీ చాలా మంచివాడు. నాతో సన్నిహితంగా మెలిగేవాడు ’’ అని మల్లికా శెరావత్ చెప్పింది.
‘‘ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ, అతడి పేరును మీకు చెప్పను. ఒక సినిమా నిర్మాత పాటలో నటించమని నా దగ్గరికి వచ్చాడు. ఆ చిత్రంలో ఒక హాట్ సాంగ్ ఉందని చెప్పాడు. మీరు హాట్ అని ప్రేక్షకులకు ఏలా తెలుస్తుందన్నాడు. మీరు ఎంత హాట్‌గా ఉన్నారంటే మీ నడుము మీద చపాతీలు హీట్ చేస్తానన్నాడు. ఇలాంటి విచిత్రమైన ఐడియాతో నా దగ్గరికి వచ్చాడు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా. కానీ, నేను ఆ పాటకు ఓకే చెప్పలేదు ’’ అని ఆమె వివరించింది.