Jun 14 2021 @ 09:00AM

బెల్లంకొండ ‘ఛ‌త్ర‌ప‌తి’ షూటింగ్ ప్లాన్‌

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, సంచలన దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకుడిగా బాలీవుడ్‌లో ‘ఛ‌త్ర‌ప‌తి’ చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లుగా నిర్మాత డా. జయంతిలాల్ గడ అధికారికంగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈపాటికే చిత్రీక‌ర‌ణ ప్రారంభం కావాల్సింది. కానీ కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగింది. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో కురిసిన వ‌ర్షాల‌తో ఈ సినిమా కోసం వేసిన సెట్ పాడైంది. కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితులు కాస్త కుదుట‌ప‌డుతున్నాయి. సినీ నిర్మాత‌లు షూటింగ్‌ల అనుమ‌తుల కోసం వేచి చూస్తున్నారు. ప‌ర్మిష‌న్ ఓకే కాగానే ఛ‌త్ర‌ప‌తి రీమేక్‌ను షురూ చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నార‌ట‌. హైద‌రాబాద్‌లో వ‌ర్షాల కార‌ణంగా పాడైన విలేజ్ సెట్‌ను ఇప్పుడు రీసెట్ చేస్తున్నారు. జూలై  మొద‌టి వారం నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంద‌ట‌. హైద‌రాబాద్‌, ముంబై, బంగ్లాదేశ్‌ల‌లో షూటింగ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.