ఆ పాట చూసి ‘నువ్వు బ్రా వేసుకున్నవా’ అని నా కుటుంబ సభ్యులు అడిగారు: నటి

విభిన్న చిత్రాలు, పాత్రలతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి నుష్రత్ భరుచ్చా. ఈ బ్యూటీ తన అభినయంతోనే కాకుండా ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఎంతోమంది అభిమానుల మనసులు దోచుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలో తన పాత్ర చిత్రణపై కుటుంబ సభ్యుల రియాక్షన్ గురించి మాట్లాడింది.


నుష్రత్ 2018లో విడుదలైన ‘సోను కే టిటు కి స్వీటీ’ అనే మూవీలో ‘ఛోటే ఛోటే పెగ్’ అనే ఐటెమ్ నంబర్‌ను చేసింది. దీనికి లవ్ రంజన్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ ఆర్యన్, సన్నీ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.


ఈ పాట గురించి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. నుష్రత్ భరుచ్చా తన తల్లి, తండ్రి మరియు అమ్మమ్మ తనతో కలిసి మ్యూజిక్ వీడియోను చూసిన తర్వాత కొంత విచిత్రమైన రియాక్షన్ ఇచ్చారు. ‘నిజానికి అప్పడు నా వైపు చూసి.. ‘నువ్వు బ్రా వేసుకున్నవా?’ అని నన్ను అడిగారు. నేను రెండు సెకన్లు ఆగి అది బ్రాలెట్ అన్నాను. దాన్ని స్టైల్‌గా అలా అంటారు. ఎంతోమంది దాన్ని వేసుకుంటార’ని ఈ బ్యూటీ చెప్పింది.


ఈ భామ ఇంకా మాట్లాడుతూ.. ‘అది చూసి వారు కొంచెం ఆశ్చర్యపోయారు. అయినా అది ఓ సినిమా కోసం చేశా. అది హిట్ అయ్యింది. అందుకే అనంతంర నా కుంటుంబ సభ్యులు అది అర్థం చేసుకున్నార‌’ని తెలిపింది.

Advertisement

Bollywoodమరిన్ని...