ఆ పరిస్థితిని బ్రేక్ చేశారంటూ.. విక్కీ, కత్రినా పెళ్లి విషయంపై కామెంట్స్ చేసిన Kangana Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఏ విషయం గురించైన ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతుంటుంది. అందుకే చాలాసార్లు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. అయితే తాజాగా రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారంలో ఉన్న జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గురించి కామెంట్స్ చేసింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీలో.. ‘ విజయవంతమైన, ధనవంతులైన పురుషులు చాలా తక్కువ వయస్సు గల స్త్రీలను వివాహం చేసుకోవడం గురించి చాలా కథలు విన్నాం… స్త్రీలు తమ భర్త కంటే ఎక్కువ విజయవంతమవడం ఒక పెద్ద తప్పుగా భావిస్తుంటారు. 

ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత మహిళలకు వివాహం అసాధ్యమని, చిన్న వయసు వాడిని పెళ్లి చేసుకోడం కుదరదని అందరూ అనుకుంటు ఉంటారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని రిచ్, సక్సెస్‌ఫుల్ మహిళ సెక్సిస్ట్ నిబంధనలను బ్రేక్ చేయడం ఆనందంగా ఉంది. మూస ధోరణిని తిరగరాసినందుకు వారికి అభినందనలు’ అంటూ రాసుకొచ్చింది.


Advertisement

Bollywoodమరిన్ని...