Abn logo
Aug 11 2020 @ 20:00PM

జుట్టు కత్తిరించుకున్నందుకు క్షమించు దేవుడా..: రణ్‌దీప్ హుడా

ముంబై: బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా దేవుడికి క్షమాపణలు చెప్పాడు. తాను జుట్టు కత్తిరించుకోనని ప్రమాణం చేసినప్పటికీ అతిక్రమించినందుకు మన్నించమంటూ గురుద్వారాలో వేడుకున్నాడు. తాను నటిస్తున్న సారాగర్హి సినిమా పూర్తయ్యేవరకు తాను జుట్టు కత్తిరించుకోనని, గడ్డం తీయనని ఇంతకుముందు గురుద్వారాలో రణ్‌దీప్ హుడా ప్రమాణం చేశాడు. అయితే మాఫియా నేపథ్యంలో ఇటీవల విడుదలైన ఎక్స్‌ట్రాక్షన్ సినిమా కోసం క్లీన్ షేవ్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో సినిమా కోసం తన ప్రమాణాన్ని పక్కనపెట్టాడు. ఈ నేపథ్యంలో గురుద్వారా వెళ్లి భగవంతుడికి క్షమాపణ చెప్పాడు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించాడు. ‘ఇటీవల గురుద్వారా వెళ్లాను. అక్కడ దేవుడికి క్షమాపణ చెప్పాను. ఎక్స్‌ట్రాక్షన్ సినిమా కోసం జుట్టు కత్తిరించుకున్నాను. అయితే ఓ పక్క సినిమాలో నటిస్తున్నాననే కానీ మరో వైపు దేవుడికిచ్చిన మాట తప్పానని చాలా బాధపడ్డానం’టూ రణ్‌దీప్ వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement