సిరాజ్‌.. బ్రేవ్‌ హార్ట్‌

ABN , First Publish Date - 2021-01-23T09:24:14+05:30 IST

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను అభినందిస్తూ ట్విటర్‌లో ఉద్వేగభరిత సందేశాన్ని ట్వీట్‌ చేశాడు

సిరాజ్‌.. బ్రేవ్‌ హార్ట్‌

  • బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర ప్రశంస

ముంబై: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను అభినందిస్తూ ట్విటర్‌లో ఉద్వేగభరిత సందేశాన్ని ట్వీట్‌ చేశాడు. ‘సిరాజ్‌.. బ్రేవ్‌ హార్ట్‌, సన్‌ ఆఫ్‌ ఇండియా’.. నిన్ను చూసి గర్విస్తున్నా. తండ్రి చనిపోయాడన్న దుఃఖాన్ని దిగమింగి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీ్‌సలో దేశం తరఫున అద్భుతంగా రాణించావు. స్వదేశానికి వచ్చాక నువ్వు మీ తండ్రి సమాధి వద్దకు వెళ్లి ప్రార్థించిన ఫొటో చూసి నా గుండె బరువెక్కింది. ఆయనకి స్వర్గలోక ప్రాప్త్తికలగాలని కోరుకుంటున్నా’ అని ధర్మేంద్ర ట్వీట్‌ చేశాడు. దీనికి ధర్మేంద్ర అభిమానులు.. సిరాజ్‌కు ఈ కష్ట సమయంలో ఽభగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలంటూ కామెంట్స్‌ పెట్టారు.

Updated Date - 2021-01-23T09:24:14+05:30 IST