బాలీవుడ్‌ నటుడు బ్రహ్మ మిశ్రా మృతి

బాలీవుడ్‌ నటుడు బ్రహ్మ మిశ్రా(36) అకాల మరణం చెందారు. గురువారం ముంబైలో తను నివసిస్తున్న ఫ్లాట్‌లో శవమై కనిపించారు. కుళ్లిపోతున్న స్థితిలో ఉన్న బ్రహ్మ మిశ్రా మృతదేహాన్ని పోలీసులు శవపరీక్ష కోసం డా.కూపర్‌ హాస్పిటల్‌ కి తరలించారు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ‘మీర్జాపూర్‌’ వెబ్‌సిరీస్‌లో లలిత్‌ పాత్రలో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘మంజి’, ‘కేసరి’ సహా పలు బాలీవుడ్‌ చిత్రాల్లో ఆయన నటించారు. బ్రహ్మ మిశ్రా మృతికి పలువురు బాలీవుడ్‌ నటులు  సంతాపం తెలిపారు. 


Advertisement

Bollywoodమరిన్ని...