ధైర్యముంటే నా ముందుకి వచ్చి మాట్లాడండి.. ఆరాధ్యపై ట్రోలింగ్‌కి కౌంటర్ ఇచ్చిన అభిషేక్ బచ్చన్

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ గారాల పట్టీ ఆరాధ్య గత నెల పదో పుట్టిన రోజు జరుపుకుంది. దాని కోసం జూనియర్ బచ్చన్ ఫ్యామిలీ మాల్దీవులకి వెళ్లి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తిరిగి వచ్చిన వీరు ముంబై ఎయిర్‌పోర్టులో మీడియాకి చిక్కారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో ఆరాధ్య నడక గురించి విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.


తాజాగా తన కొత్త చిత్రం ‘బాబ్ బిశ్వాస్’ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌ గురించి మాట్లాడాడు అభిషేక్. ‘నేను పబ్లిక్ ఫిగర్‌ని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తే పట్టించుకోను. కానీ నా కూతురుని టార్గెట్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఎందుకంటే ఆరాధ్యకి మీకు ఏం సంబంధం లేద’ని నటుడు తెలిపాడు. మీకు ధైర్యముంటే నా ముందుకు వచ్చి మాట్లాడంటూ ట్రోలర్స్‌కి వార్నింగ్ ఇచ్చాడు జూనియర్ బచ్చన్.


కాగా, అభిషేక్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బాబ్ బిశ్వాస్’. 2012లో వచ్చిన సుజోయ్ ఘోష్ మూవీ ‘కహాని’లో ఓ క్యారెక్టర్‌కి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బెంగాలీ నటుడు సస్వత చటర్జీ ఆ పాత్రని చేయగా..  ఇప్పుడు ఈ ‘ధూమ్’ స్టార్‌తో పూర్తి సినిమాని తీసుకొస్తున్నారు.

Advertisement

Bollywoodమరిన్ని...