Abn logo
Aug 11 2020 @ 19:17PM

అభిమానులకు అభిషేక్ థ్యాంక్స్

ముంబై: బిగ్ బీ తనయుడు అభిషేక్ బచ్చన్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు. తాను ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతున్నప్పుడు తనకు అండగా ఉన్న అభిమానులందరికీ థ్యాంక్స్ అంటూ ఓ వీడియో సందేశం షేర్ చేశాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ‘నేను కరోనా నుంచి కోలుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆ మహమ్మారితో పోరాడుతున్నప్పుడు నేను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి అభిమానికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. నాపై మీరు చూపించిన ప్రేమకు మనసు ఉప్పొంగిపోతోంది.


సోషల్ మీడియాలో మీ పోస్టులు చదువుతుంటే ఎంతో ఆనందం వేసిందం’టూ అభిషేక్ తన వీడియోలో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే అమితాబ్‌ బచ్చన్‌తో పాటు కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనుమరాలు ఆరాధ్యలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఐశ్వర్య, ఆరాధ్యలు కోలుకుని డిశ్చార్జ్ కాగా అనంతరం అమితాబ్ కోలుకున్నారు. రెండు రోజుల క్రితం అభిషేక్‌కు కూడా కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయనను కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.


Advertisement
Advertisement
Advertisement