బోల్డ్ అంత బ్యూటీ

ABN , First Publish Date - 2020-07-15T05:30:00+05:30 IST

అనుష్కా శర్మ అంటే అందమే కాదు... చక్కని అభినయం కూడా! బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో... ఇప్పుడూ అంతే గ్లామర్‌గా మెరిసిపోతోంది...

బోల్డ్ అంత బ్యూటీ

అనుష్కా శర్మ అంటే అందమే కాదు... చక్కని అభినయం కూడా! బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో... ఇప్పుడూ అంతే గ్లామర్‌గా మెరిసిపోతోంది. కరోనా కాలంలో షూటింగ్‌లేమీ లేకపోయినా... ఈ లోగా ‘తెర’ వెనుక పనులన్నీ చక్కబెట్టుకొంటోంది. అలాగని అభిమానులను మర్చిపోలేదు అనుష్కా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ‘బోల్డ్‌’న్ని ఫొటోలు షేర్‌ చేస్తూ గిలిగింతలు పెడుతూనే ఉంది. అలాంటిదే ఈ ఛాయాచిత్రం. ఓ ఆంగ్ల మ్యాగజైన్‌ కోసం ఈ బ్యూటీ ఇలా పోజిచ్చింది. స్విమ్‌సూట్‌లోనూ మైమరిపించింది. ఇవి చూసి ఫ్యాన్స్‌కే కాదు... అనుష్కా భర్త, భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీకి కూడా మతి పోయింది. లవ్‌ ఎమోజీలతో మనోడు వాటికి లైకులేసుకున్నాడు. 

అన్నట్టు అనుష్కాశర్మ వేసుకున్న ఈ షర్ట్‌ ధర ఎంతో తెలుసా? అక్షరాలా లక్షా పదిహేడు వేల రూపాయలు! ఆమె స్విమ్‌ సూట్‌ ధర రూ.39,300. ఈ ఫొటో షూట్‌ సందర్భంగా విరాట్‌తో తన అనుబంధం గురించి ఆమె ముచ్చటించింది. ‘‘బిజీ షెడ్యూల్స్‌ కారణంగా పెళ్లయిన తొలి ఆరు మాసాల్లో మేమిద్దరం కలిసి ఉంది 21 రోజులే! అదే విరాట్‌ విదేశాలు వెళ్లినప్పుడైతే మేము ఎంతో ఆస్వాదిస్తాం’’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్కాశర్మ. ఏదిఏమైనా ఈ విపత్కాలంలో జీవితం అర్థం తెలిసిందంటోందీ స్వీటీ! 


Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST