నకిలీ సర్టిఫికెట్లపై వైద్య శాఖలో గుబులు

ABN , First Publish Date - 2021-01-24T07:02:30+05:30 IST

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వైద్య శాఖ వర్గాలలో గుబులు పుట్టిస్తోంది. వైద్య శాఖలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఓ ముఠా ఆర్డర్లు సృష్టించి, పలువురికి జారీ చేసిందని.. దీని వెనుక పెద్దఎత్తున డబ్బు చేతులు మారాయనే ఆరోపణలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.

నకిలీ సర్టిఫికెట్లపై వైద్య శాఖలో గుబులు

అనంతపురం వైద్యం, జనవరి 23: నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వైద్య శాఖ వర్గాలలో గుబులు పుట్టిస్తోంది. వైద్య శాఖలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఓ ముఠా ఆర్డర్లు సృష్టించి, పలువురికి జారీ చేసిందని.. దీని వెనుక పెద్దఎత్తున డబ్బు చేతులు మారాయనే ఆరోపణలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.  కొన్ని నెలలుగా వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, జిల్లా వైద్యశాఖ, డీసీహెచ్‌ఎ్‌స పరిధిలో వందలాది నియామకాలు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ముఠా జిల్లా కలెక్టర్‌ పేరుతో నకిలీ నియామక ఉత్తర్వులు తయారు చేసి, చాలామందికి జారీ చేసింది. వాటితో వైద్యశాఖలోని వివిధ పోస్టుల్లో చేరేందుకు పలువురు ప్రయత్నించగా, కొందరిని పట్టుకుని జా యిన్‌ చేసుకోలేదు. మరికొందరు జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది. తాడిపత్రి, మడకశిర నియోజకవర్గాలతోపాటు అనంతపురం సర్వజనాసుపత్రిలో ఈ నకిలీ సర్టిఫికెట్లతో చేరినట్లు ప్రచారం సాగుతోంది. అది కూడా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే అభ్యర్థులు నమ్మి ఆ ముఠా ఇచ్చిన నకిలీ నియామక ఉత్తర్వులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏఓలు శనివారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

Updated Date - 2021-01-24T07:02:30+05:30 IST