Abn logo
Sep 20 2020 @ 16:56PM

తెలుగులో ‘బోగన్‌’ .. ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..

Kaakateeya

జయం రవి, అరవింద్‌ స్వామి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.  అర‌వింద్‌స్వామి కాంబినేష‌న్‌తో 'జ‌యం' ర‌వి న‌టించిన‌ 'త‌ని ఒరువ‌న్' (2015) సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా 'ధృవ' పేరుతో రీమేక్ చేయ‌గా, ఇక్క‌డా సూప‌ర్ హిట్ట‌యింది. 'త‌ని ఒరువ‌న్' త‌ర్వాత 'జ‌యం' ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌లో మరో సినిమాలో తమిళ్‌లో విడుదలైంది. ఆ సినిమా పేరే 'బోగ‌న్‌'. ఈ సినిమా ఇప్పుడు సేమ్‌ టైటిల్‌తో తెలుగులో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ఎస్.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయని, ఎక్క‌డా అనువాద చిత్ర‌మ‌నే అభిప్రాయం క‌ల‌గ‌కుండా క్వాలిటీతో డ‌బ్ చేశామ‌ని నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు. 

ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. ఒక బ్యాంక్ దొంగ‌త‌నం కేసును ద‌ర్యాప్తు చేస్తూ, ఆదిత్య అనే నిందితుడిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే విక్ర‌మ్ అనే పోలీసాఫీస‌ర్ క‌థ ఇది. త‌న‌కు చిక్క‌కుండా త‌ప్పించుకుంటున్న ఆదిత్య‌ను ఒక అద్భుత ప్లాన్‌తో విక్ర‌మ్ ప‌ట్టుకోవ‌డం టెర్రిఫిక్ ఇంట‌ర్వెల్ బ్లాక్‌. ఆ త‌ర్వాత క‌థ ప్రేక్ష‌కులు ఊహించ‌ని మ‌లుపులు తిరిగి, అనుక్ష‌ణం కుర్చీల‌లో మునివేళ్ల‌పై కూర్చోపెట్టేలా క‌థ‌నం ప‌రుగులు పెడుతుంది. విక్ర‌మ్ ఐపీఎస్‌గా జ‌యం ర‌వి, ఆదిత్య‌గా అర‌వింద్ స్వామి నటించారు. హీరోయిన్‌గా హ‌న్సికా మొత్వాని న‌టించిన ఈ చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ ఇత‌ర పాత్ర‌ధారుల్లో నటించారు. డి. ఇమ్మాన్ సంగీతం స‌మ‌కూర్చ‌గా, సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఈ నెల 26న చిత్ర ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత రామ్‌ తాళ్లూరి తెలిపారు. త్వ‌ర‌లోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement