కృష్ణపట్నం పోర్టులో బాడీ శానిటైజర్‌ యంత్రాలు

ABN , First Publish Date - 2020-04-08T11:03:09+05:30 IST

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా మంగళవారం కృష్ణపట్నం పోర్టులో బాడీ శానిటైజర్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు

కృష్ణపట్నం పోర్టులో బాడీ శానిటైజర్‌ యంత్రాలు

ముత్తుకూరు, ఏప్రిల్‌7: కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా మంగళవారం కృష్ణపట్నం పోర్టులో బాడీ శానిటైజర్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. కరోనాను అరికట్టేందుకు పోర్టు యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కేపీసీఎల్‌ ప్రతినిధులు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు సంబంధించి నిబంధనల మేరకు కొద్ది మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.


ఇప్పటికే విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాస్కులు, గ్లౌజులు తప్పనిసరి చేసి, ప్రతి రెండు గంటలకు చేతులను శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప్రతి చోట శానిటైజర్లు ఏర్పాటు చేశారు. మంగళవారం పోర్టు నుంచి వెళ్లే ఉద్యోగుల కోసం బాడీ శానిటైజర్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ యంత్రంలోపలికి వెళ్లి, బయటికి వస్తే పూర్తి శరీరం శానిటైజ్‌ అవుతుంది. ప్రతి ఉద్యోగికి థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరి చేసామని పోర్టు ప్రతినిధులు తెలిపారు. 

Updated Date - 2020-04-08T11:03:09+05:30 IST