mystery solved: భార్య పుట్టింటికి వెళ్లిందని..సోషల్ మీడియాలో భార్యతో మాట్లాడిన మహిళ అనుకొని భర్త ఇంటికి పిలిస్తే...

ABN , First Publish Date - 2022-09-01T15:55:34+05:30 IST

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త చేసిన దారుణంపై మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు....

mystery solved: భార్య పుట్టింటికి వెళ్లిందని..సోషల్ మీడియాలో భార్యతో మాట్లాడిన మహిళ అనుకొని భర్త ఇంటికి పిలిస్తే...

ఇండోర్ (మధ్యప్రదేశ్): భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త చేసిన దారుణంపై మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.(solved a mysterious) మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh)ఇండోర్‌లో(Indore) ట్రాన్స్‌జెండర్(Transgender)మృతదేహాన్ని కనుగొన్న పోలీసులకు సీసీటీవీ ఫుటేజీ(CCTV footage) లభించడంతో దర్యాప్తులో మిస్టరీ వీడింది. ఇండోర్ నగరంలోని ఖజ్రానా ప్రాంతానికి చెందిన నూర్ మహ్మద్ భార్య(wife) పుట్టింటికి(maternal home) వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో జోయా కిన్నర్‌( Zoya Kinnar) అనే ఆమెతో సోషల్ మీడియాలో మాట్లాడిందని భర్త తెలుసుకున్నాడు.


భార్య వెళ్లిన తర్వాత భర్త(husband) నూర్ మహ్మద్ జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. భార్య లేని సమయంలో ఇంటికి పిలిపించిన జోయా ట్రాన్స్‌జెండర్ అని భర్త నూర్ మహ్మద్ తెలుసుకొని షాక్ అయ్యాడు. ట్రాన్స్‌జెండర్ జోయాతో నూర్ మహ్మద్ ల మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో మహ్మద్ జోయాను గొంతుకోసి చంపాడని ఇండోర్ పోలీసులు తెలిపారు.‘‘నిందితుడు నూర్ మహ్మద్ ట్రాన్స్‌జెండర్ జోయా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి,(Two Pieces) ఒక ముక్కను గోనె సంచిలో నింపి బైపాస్‌రోడ్డుకు సమీపంలోని పొదల్లోకి విసిరాడు. మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోని పెట్టెలో దాచిపెట్టాడు.


 నూర్ మహ్మద్ ఇంటి నుంచి జోయా మృతదేహం సగభాగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నూర్ మహ్మద్ పై  హత్య కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు(arrest) చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సంపత్ ఉపాధ్యాయ(Deputy Commissioner of Police (DCP) Sampat Upadhyay) చెప్పారు.ఆగస్టు 28 నుంచి కనిపించకుండా పోయిన ట్రాన్స్‌జెండర్ జోయా మృతదేహం సగ భాగం ఇండోర్‌లోని స్కీమ్ నంబర్ 134 ప్రాంతంలో పోలీసులకు దొరికింది.


Updated Date - 2022-09-01T15:55:34+05:30 IST