ఈ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచండి.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2022-04-12T16:11:01+05:30 IST

దాహం వేస్తేనే నీళ్లు తాగుతాం. కానీ వేసవిలో ఈ అలవాటు డీహైడ్రేషన్‌కు గురి చేస్తుంది

ఈ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచండి.. ఎందుకంటే?

ఆంధ్రజ్యోతి(12-04-2022)

దాహం వేస్తేనే నీళ్లు తాగుతాం. కానీ వేసవిలో ఈ అలవాటు డీహైడ్రేషన్‌కు గురి చేస్తుంది. కాబట్టి శరీరంలో నీళ్లు తగ్గేలోపే, దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా సరిపడా నీళ్లు తాగడం లేదని తెలిపే ఈ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి.


నోరు ఎండిపోవడం: నోరు, పెదవులు పొడిబారడం, నోటి చుట్టూ చర్మం పొడిబారడం. సరిపడా నీళ్లు తాగకపోతే, నోట్లో లాలాజలం తయారవదు. దాంతో నోరు, పెదవులు ఎండిపోతాయి.


చర్మం పొడిబారడం: చమటతో చర్మం దమ్ము, ధూళి, జిడ్డులను వదిలించుకుంటుంది. చర్మానికి సరిపడా నీరు అందనప్పుడు చమట పట్టే వీలు లేక, పొడిగా మారుతుంది. దాంతో చర్మం మీద దుమ్ము, జిడ్డు పేరుకుపోయి, చర్మ రంథ్రాలు పూడుకుపోయి, సెగ గడ్డలు మొదలవుతాయి.


కీళ్ల నొప్పులు: కీళ్లు కుదుపులను తట్టుకోవాలంటే శరీరంలో సరిపడా నీళ్లుండాలి. మన శరీరంలోని కార్టిలేజ్‌, వెన్నులోని డిస్కులు 80శాతం నీటితో తయారై ఉంటాయి. ఇవి ఒరిపిడికి గురవకుండా, తేలికగా కదలాలంటే సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. లేదంటే ఆ లోటు కీళ్ల నొప్పులతో బయల్పడుతుంది.


బరువు పెరగడం: డీహైడ్రేషన్‌ను శరీరం ఆకలిగా పొరపాటు పడుతుంది. దాంతో అవసరం లేకపోయినా, ఆహారాన్ని వెతుక్కుని తింటాం. దాంతో అదనపు క్యాలరీలు తోడై అవసరానికి మించి బరువు పెరుగుతాం. ఇలా జరగకుండా ఉండాలంటే, సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. 

Updated Date - 2022-04-12T16:11:01+05:30 IST