వైభవంగా బొడ్డెమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-09-25T06:17:11+05:30 IST

బతుకమ్మ సంబరాల్లో భాగంగా ముందువచ్చే బొడ్డెమ్మ వేడుకలను సిరిసిల్ల మానేరు తీరంలో వైభవంగా జరుపుకున్నారు. శనివారం జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొడ్డెమ్మ సంబరాలను జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ ప్రారంభించారు.

వైభవంగా బొడ్డెమ్మ సంబరాలు
బతుకమ్మలతో జడ్పీ చైర్‌పర్సన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు

సిరిసిల్ల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ సంబరాల్లో భాగంగా ముందువచ్చే బొడ్డెమ్మ వేడుకలను సిరిసిల్ల మానేరు తీరంలో వైభవంగా జరుపుకున్నారు. శనివారం జిల్లా మహిళా శిశు,  దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బొడ్డెమ్మ సంబరాలను జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ ప్రారంభించారు. ఫైన్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మ, బొడ్డెమ్మలతో తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను చాటుతూ మహిళలు ఆటాపాటలతో గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణ  రాష్ట్రం అవిర్భావం తరువాత బతుకమ్మకు విశేష ఆదరణ లభించిందన్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడపడుచులు జరుపుకుంటూ ఖ్యాతి ఇనుమడింపజేశారన్నారు. ప్రభుత్వం ఆడపడుచులందరికీ బతుకమ్మ సారెగా చీరలు అందిస్తోందన్నారు. బతుకమ్మ చీరలు అందించడంలో మంత్రి కేటీఆర్‌ కీలక పాత్ర పోషించారన్నారు.  జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్‌ కౌన్సిలర్‌ దార్నం అరుణ, అర్బన్‌ సిరిసిల్ల సీడీపీవో అలేఖ్య, వేములవాడ సీడీపీవో ఎల్లయ్య, సఖి నిర్వాహకులు రోజా, సుచరిత, బ్యాంక్‌ డైరెక్టర్‌ నేరేళ్ల శ్రీకాంత్‌, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T06:17:11+05:30 IST