బీఓబీ టర్నోవర్‌ రూ.16.73 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2020-11-25T06:42:10+05:30 IST

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ).. రూ.16.73 లక్షల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తూ దేశంలో మూడో స్థానంలో ఉందని బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ మన్మోహన్‌ గుప్తా వెల్లడించారు...

బీఓబీ టర్నోవర్‌ రూ.16.73 లక్షల కోట్లు

విజయవాడ (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ).. రూ.16.73 లక్షల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తూ దేశంలో మూడో స్థానంలో ఉందని బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ మన్మోహన్‌ గుప్తా వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ బెంజ్‌ సర్కిల్‌లో ఆధునీకరించిన బీఓబీ శాఖను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. బీఓబీ దేశంలో 18 జోన్లు, 148 రీజియన్లు, 8,965 శాఖలు, 12,087 ఏటీఎంలను నిర్వహిస్తోందన్నారు. 20 దేశాల్లో 99 ఓవర్సీస్‌ శాఖలతో ఇండియాస్‌ ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌గా ప్రాచుర్యం పొందిందన్నారు. కాగా ఏపీ, తెలంగాణల్లో బ్యాంక్‌ మొత్తం 425 శాఖలను నిర్వహిస్తోందని తెలిపారు. సెప్టెంబరు ముగిసే నాటికి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్‌ వ్యాపారం రూ.60,355.72 కోట్లుగా ఉందని గుప్తా తెలిపారు. 

Updated Date - 2020-11-25T06:42:10+05:30 IST