శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి: చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు పడవ బోల్తాపడడంతో మృతి చెందాడు. శ్రీకాకుళం మండలం పెదగనగళ్లవాని పేట గ్రామానికి చెందిన గనగళ్ల కృష్ణ శుక్రవారం నాగావళి నది, బంగాళాఖాతం కలిసే ప్రాంతంలో (మెగ)లో చేపల వేటకు పడవలో వెళ్లాడు. పడవ బోల్తాప డడంతో కృష్ణ నీటిమునిగి మృతిచెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ విజయకుమార్ కేసు నమోదు దర్యాప్తుచేస్తున్నారు.