ప్రపంచకప్ వాయిదాపడితే.. ఐపీఎల్‌లో ఎవరూ పాల్గొనవద్దు: ఆసీస్ మాజీ కెప్టెన్

ABN , First Publish Date - 2020-05-23T18:29:39+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా టీ-20 ప్రపంచకప్ వాయిదాపడినా.. రద్దు అయినా ఆ స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని ఇప్పటికే చాలామంది అన్నారు.

ప్రపంచకప్ వాయిదాపడితే.. ఐపీఎల్‌లో ఎవరూ పాల్గొనవద్దు: ఆసీస్ మాజీ కెప్టెన్

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా టీ-20 ప్రపంచకప్ వాయిదాపడినా.. రద్దు అయినా ఆ స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని ఇప్పటికే చాలామంది అన్నారు. అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బార్డర్ మాత్రం అలా జరగవద్దని అన్నారు. ఒక డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్‌ కోసం అంతర్జాతీయ టోర్నమెంట్ రద్దు కావడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 


‘‘ఒక స్థానిక టోర్నమెంట్ కంటే.. అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి టీ-20 ప్రపంచకప్ జరగకుంటే.. ఐపీఎల్ కూడా జరగవద్దు. కేవలం డబ్బుల కోసమే ఆలోచించడం మంచిది కాదు’’ అని బార్డర్ అన్నారు. 


అయితే ఒకవేళ ప్రపంచకప్ స్థానంలో ఐపీఎల్ జరిగితే.. అందుకు ఇండియానే కారణమని ఆయన తెలిపారు. ‘‘ఒకవేళ అదే జరిగితే.. పూర్తిగా ఇండియానే ఈ ఆటని నడిపిస్తుందని తెలుస్తుంది. అదే జరిగితే ఎవరూ కూడా ఐపీఎల్‌లో పాల్గొనవద్దు. అన్ని బోర్డులు తమ ఆటగాళ్లని ఐపీఎల్ ఆడేందుకు పంపించవద్దు’’ అని బార్డర్ తెలిపారు. 

Updated Date - 2020-05-23T18:29:39+05:30 IST