ధర్మకర్తల మండలి సమావేశం

ABN , First Publish Date - 2022-05-21T05:38:04+05:30 IST

శ్రీశైలంలో శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ధర్మకర్తల మండలి సమావేశం

మొత్తం 43 ప్రతిపాదనలు

 

శ్రీశైలం, మే 20: శ్రీశైలంలో శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమావేశం లో మొత్తం 43 ప్రతిపాదనలు ప్రవేశ పెట్టగా  37 ప్రతిపాదనలను సభ్యులందరూ ఆమోదించారని అన్నారు. అయితే 5 ప్రతిపాదనలను తిరస్కరించామని, ఒక ప్రతిపాదనను పరిశీలించినట్లు తెలిపారు. అలాగే క్షేత్రపరిధిలో ప్రసాదం స్కీం ద్వారా దేవస్థానం చేపట్టిన పనులను పరిశీలించామని, వీటిని నెలలోపే పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకురానున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. కుటీర నిర్మాణం కింద దేవస్థానం నిర్మిస్తున్న 200 గదుల గణేశ సదనాన్ని భక్తులకు అందుబాటులోనికి తెస్తామని అన్నారు. ఆలయప్రాంగణంలో సర్పదోష నివారణ పూజ, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటివి నిర్వహిం చేందుకు ఆమోదించినట్లు తెలిపారు. సామాన్య భక్తులకు దాతల సహకా రంతో డార్మిటరీ నిర్మాణం, లలితాంబికా వాణిజ్య సముదాయంలో 36 దుకాణాల నిర్మాణానికి టెండరు, ఇంజనీరింగ్‌ స్టోరు వద్ద సిమెంట్‌ కాంక్రీట్‌, హఠకేశ్వరం ఆలయ ప్రాంగణంలో గాల్వానిక్‌ షీట్ల షెడ్డు, గంగా గౌరీ సదన్‌లో విద్యుత్‌ అంతరాయం లేకుండా జెనరేటర్‌ ఏర్పాటు, సీసీ కెమెరాల రికార్డింగ్‌ వంటి 37 ప్రతిపాదనలను ఆమోదించినట్లు అధ్యక్షుడు తెలిపారు. 


 దుకాణాల కేటాయింపుపై సమావేశం


శ్రీశైలంలో శుక్రవారం దుకాణాల కేటాయింపుపై ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, మండలి సభ్యులు, రెవెన్యూ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.  లలితాంబిక వాణిజ్య సముదాయంలో ఉన్న దుకాణాలను 41 మందికి హెచ్చు వేలంకు కేటాయించే ప్రక్రియను దేవస్థానం శుక్రవారం ప్రారంభించింది. ఈ దుకాణాలను 11.06.2022 నుంచి 10.06.2025 వరకు  కేటాయించనున్నారు. 

Updated Date - 2022-05-21T05:38:04+05:30 IST