రామతీర్థం దేవస్థానానికి ట్రస్ట్‌బోర్డు

ABN , First Publish Date - 2022-01-21T05:29:34+05:30 IST

రామతీర్ధం రామస్వామి వారి దేవస్థానానికి ప్రభుత్వం ట్రస్ట్‌ బోర్డును నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం పది మంది సభ్యులతో కూడిన ట్రస్ట్‌ బోర్డును నియమించారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు వ్యవ

రామతీర్థం దేవస్థానానికి ట్రస్ట్‌బోర్డు

 ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 

 నెల్లిమర్ల, జనవరి 20: రామతీర్ధం రామస్వామి వారి దేవస్థానానికి ప్రభుత్వం ట్రస్ట్‌ బోర్డును నియమించింది.  ఈ మేరకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం పది మంది సభ్యులతో కూడిన ట్రస్ట్‌ బోర్డును నియమించారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త  పూసపాటి అశోక్‌ గజపతిరాజు వ్యవస్థాపక కుటుంబ సభ్యుడి హోదాలో ఉంటారు. బూర్లె సత్యం, దావాల నాగ ఇందులక్ష్మి, తిరుమలరెడ్డి శ్రీనివాసరావు, దాడిశెట్టి త్రినాథ వరప్రసాదరావు, కర్రోతు బంగారుతల్లి, దాట్ల సత్యనారాయణరాజు, బుడుమూరు రమాదేవి, పడాల రాజేశ్వరిలతో పాటు ప్రస్తుతం దేవస్థానంలో ఉప ప్రధాన అర్చకునిగా విఽధులు నిర్వహిస్తున్న ఖండవిల్లి వెంకట సాయిరాం సభ్యులుగా నియమితులయ్యారు. వీరు ఈ పదవుల్లో రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు. ట్రస్టు బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంకా తేదీ ఖరారు కాలేదు. ప్రమాణ స్వీకారం జరిగిన తేదీ నుంచి వీరి పదవీ కాలం లెక్కింపులోనికి వస్తుంది. ట్రస్టు బోర్డు నియామక విషయాన్ని దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు ధ్రువీకరించారు. 



Updated Date - 2022-01-21T05:29:34+05:30 IST