Union minister నారాయణ్ రాణేకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు

ABN , First Publish Date - 2022-03-07T12:48:47+05:30 IST

కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)నోటీసు జారీ చేసింది...

Union minister నారాయణ్ రాణేకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు

ముంబై(మహారాష్ట్ర): కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)నోటీసు జారీ చేసింది. ముంబై జుహూ ప్రాంతంలోని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బంగ్లాలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని, మార్పులు చేశారన్న ఆరోపణలపై అతనికి బీఎంసీ నోటీసు పంపింది. కేంద్రమంత్రి రాణే బంగ్లాలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు రావడంతో బీఎంసీ అధికారులు ఫిబ్రవరి 21వతేదీన తనిఖీలు జరిపారు.బీఎంసీ ఆమోదించిన ప్లాన్ కు విరుద్ధంగా కేంద్రమంత్రి రాణే అనధికారికంగా భవన నిర్మాణంలో మార్పులు చేశారని బీఎంసీ అధికారుల తనిఖీల్లో తేలింది. దీనిపై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 351 కింద నోటీసు జారీ చేశారు. 


మంత్రి ఇంటి అక్రమ నిర్మాణంపై ఆర్టీఐ కార్యకర్త సంతోష్ దౌండ్కర్ ఫిర్యాదు చేశారు.మార్చి 4న అందించిన కొత్త లీగల్ నోటీసులో స్కెచ్‌లతో పాటు ప్రతి అంతస్తులో అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నాయి.కాగా తాను ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టక పోయినా, నా జుహు బంగ్లాకు బీఎంసీ నోటీసు పంపించిందని కేంద్రమంత్రి రాణే ఆరోపించారు.


Updated Date - 2022-03-07T12:48:47+05:30 IST