Abn logo
Sep 22 2021 @ 23:31PM

బీఎల్వోలు గరుడ, ఓటర్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): (బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు తప్పనిసరిగా గరుడ, ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. ఈ యాప్‌ల ద్వారానే ఓటరు జాబితాలు, పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ఎన్నికల వివరాలు తీసుకునే వీలుంటుందని చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని అన్ని మండలాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్‌వోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీటి సౌకర్యం, ఫర్నీచర్‌, టాయిలెట్స్‌ తదితర సౌకర్యాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని, పోలింగ్‌ కేంద్రాల ఫొటో తీసుకోవాలన్నారు. ఓటరు నమోదు ఫారాలను సరిచూసుకోవాలని ఏఈఆర్వోలు, ఈఆర్వోలను ఆదేశించారు. అంతకుముందు ఈ డిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ శ్రీరామ్‌రెడ్డి ఓటర్‌ హెల్ప్‌లైన్‌, గరుడ యాప్‌లపై ఏఈఆర్వోలు, ఈఆర్వోలు, బీఎల్‌వోలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, హుజూరాబాద్‌ ఆర్డీవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.