బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగాయి. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో బుధవారం రోజు 15,617 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నగరంలో నమోదైన 10,800 కేసుల కంటే 44శాతం ఎక్కువ. కొత్త కేసులతో నగరంలో యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 73,000 చేరుకుంది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ ట్విట్టర్‌లో తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ఈ రోజు కరోనా వైరస్ వల్ల రాష్ట్ర రాజధానిలో కూడా 6 మరణాలు సంభవించాయని మంత్రి తెలిపారు.