డెస్క్‌టాప్‌కి బ్లూటూత్‌ స్పీకర్‌?

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసుకోవడం కోసం బ్లూటూత్‌ స్పీకర్‌ అంత సౌకర్యవంతంగా ఉండదు. దానికోసం ప్రత్యేకంగా బ్లూటూత్‌ డాంగిల్‌ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలి.

డెస్క్‌టాప్‌కి బ్లూటూత్‌ స్పీకర్‌?

డెస్క్‌టాప్‌ అవసరాలకు బ్లూటూత్‌ స్పీకర్‌ కొనుగోలు చేయడం మంచిదా, లేక విడిగా స్పీకర్స్‌ కొనుగోలు చేయడం మంచిదా? 

- శ్రీనివాస్‌


డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసుకోవడం కోసం బ్లూటూత్‌ స్పీకర్‌ అంత సౌకర్యవంతంగా ఉండదు. దానికోసం ప్రత్యేకంగా బ్లూటూత్‌ డాంగిల్‌ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలి. అలాగే శబ్దం నాణ్యత కూడా ఆశించినంత పొందలేం. కేవలం బయటకు ఎక్కడికైనా తీసుకువెళ్లడానికి మాత్రమే ఇలాంటి బ్లూటూత్‌ స్పీకర్స్‌ అనువుగా ఉంటాయి.

దానికి బదులుగా వైర్లతో కనెక్ట్‌ చేసుకోగలిగే 5:1 స్పీకర్‌ సెటప్‌ మెరుగ్గా ఉంటుంది. దాని ద్వారా పూర్తి స్థాయిలో హోమ్‌ థియేటర్‌ అనుభూతిని కూడా పొందవచ్చు.


Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST