Abn logo
Jun 3 2020 @ 05:47AM

గందరగోళంగా వ్యవ‘సాయం’

విధులు బహిష్కరిస్తామంటూ ఏఈవోల హెచ్చరికలు

నియంత్రిత సాగు అమలుపై నీలినీడలు

వానాకాల పంటల సాగుపై ప్రభావం చూపే అవకాశం

కొత్త మండలాల్లో అడ్రస్‌లేని వ్యవసాయ శాఖ కార్యాలయాలు


ఆదిలాబాద్‌, జూన్‌2 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ యేడు వ్యవసాయ సాగులో సమూల మార్పులను తీసు కొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా జిల్లా వ్యవ సాయ శాఖ అధికారుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవు తోంది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారుల సమస్యలను పరిష్కరించకుంటే విధులు బహిష్కరిస్తామంటూ సోమవారం ఏఈవోల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధి కారికి వినతి పత్రాన్ని అందజేయడం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది.


ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రైతుల దరికి చేరాలంటే ఏఈవోలదే కీలక పాత్రగా మారుతోంది. అసలే వర్షాకాల సీజన్‌ మొదలు కావడంతో రైతులకు సలహాలు, సూచనలు చేయాల్సిన అధికారులు తమ సమస్యలు పరిష్కరిం చాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో 101 క్లస్టర్లు ఉన్నాయి. 95 మంది ఏఈవోలు విధులు నిర్వర్తిస్తుండగా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే పాత మండలాల్లో కార్యాలయాలు ఉన్నా కనీస వసతులు కనిపించడం లేవు. జిల్లాలో పని చేస్తున్న ఏఈవోలలో సగం మందికి పైగా మహిళా అధికారులే ఉన్నారు. కానీ కార్యాలయాల్లో కనీస వసతులు లేక పోవ డంతో విధులు నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు.


నియంత్రిత సాగుపై అనుమానాలు..

ఇప్పటికే పంటల సాగు విధానంలో పలుమార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాల సీజన్‌ నుంచే నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అధికారు లకు దిశానిర్దేశం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచిస్తోంది. కానీ వసతులు కల్పించ కుండానే విధులు నిర్వహించాలని చెప్పడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం అనుమానంగానే కనిపిస్తోంది. కార్యాలయాలకు వెళ్లి విధులు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. 


నిలువ నీడ కరువు..

రెండేళ్లక్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త మండలాల్లో వ్యవసాయ శాఖ కార్యాలయాలు లేక నిలువ నీడ కరువవుతుందంటున్నారు. ముఖ్యం గా సిరికొండ, భీంపూర్‌, గాదిగూడ, మావల మండలాల్లో వ్యవసాయశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అయినా  నెలల తరబడి అద్దె చెల్లించక పోవడంతో ఖాళీ చేయాల్సిన పరిస్థి తులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం సిరికొండ మండలంలో ఇదే పరిస్థితి ఏర్పడడంతో కార్యాలయ భవనాన్ని ఖాళీ చేశారు. కనీసం విద్యుత్‌ బిల్లులను చెల్లించక పోవడంతో జైనథ్‌లోని వ్యవసాయశాఖ కార్యాల యానికి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. 


పెరిగిపోతున్న ఒత్తిళ్లు..

మండల స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులపై రాజకీయ నేతల ఒత్తిళ్లు పెరిగి పోతున్నాయి. సర్పంచ్‌ నుంచి జడ్పీటీసీ వరకు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు అధికారులు వాపోతున్నారు. ఇటీవల ఇంద్రవెల్లి మండలంలో ఓ మండల స్థాయి నేత తన మాట వినడం లేదని అక్కడ పని చేస్తున్న ఏఈవోపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి బెదిరింపులకు గురిచేసిన దాఖలాలు ఉన్నాయని అధికా రులు పేర్కొంటున్నారు.  పంటల సాగు వివరాల నమోదు, బీమా, పెట్టు బడి సాయం, పంట నష్టం, రైతు ఆత్మహత్యల నివేదికలపై స్థానిక నేతల జోక్యం పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. మాట వినని అధికారులను మం డలం నుంచి బదిలీ చేయాలంటూ అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నారు.


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. : ఆశాకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి 

జిల్లాలో పనిచేస్తున్న ఏఈవోల సమస్యలు, కా ర్యాలయాల వసతులపై ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్తా. ఇంద్రవెల్లి ఏఈవో విషయంపై ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశాం. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తాం. ఇప్పటికే నియంత్రిత సాగు విధానంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం.


Advertisement
Advertisement