జగన్నాథ రథయాత్రపై నీలినీడలు

ABN , First Publish Date - 2022-06-26T05:39:05+05:30 IST

బారువలో జగన్నాథ రథయాత్రకు సుదీర్ఘ చరిత్రఉంది. ఇక్కడ ఏటా యాత్రను ఘనంగా నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లుగా కొవిడ్‌తో నిర్వహించలేదు. ఈ ఏడాది అన్నిచోట్ల రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ బారువలో మాత్రం ఎటువంటి ఏర్పాట్లు

జగన్నాథ రథయాత్రపై నీలినీడలు
సిద్ధం కాని రథం

 బారువలో సిద్ధంకాని రథం 

 ఏర్పాట్లు చేయని దేవదాయశాఖ అధికారులు

సోంపేట రూరల్‌: బారువలో జగన్నాథ రథయాత్రకు సుదీర్ఘ చరిత్రఉంది. ఇక్కడ ఏటా యాత్రను ఘనంగా నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లుగా కొవిడ్‌తో నిర్వహించలేదు. ఈ ఏడాది అన్నిచోట్ల రథయాత్ర నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ బారువలో మాత్రం ఎటువంటి ఏర్పాట్లు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అసలు యాత్ర నిర్వహిస్తారా? లేదా? అన్నది స్పష్టతలేదు. మరోవైపు రథయాత్ర సమయం సమీపిస్తోంది. మరో మూడురోజుల వ్యవధి మాత్రమేఉంది.  నుంచే రథయాత్ర ప్రారంభం కానుంది. కానీ ఇంతవరకూ రథం సిద్ధం చేయలేదు. ఆరుబయట అలానే విడిచిపెట్టేశారు. దీంతో యాత్ర నిర్వహణపై నీలినీడలు కమ్ము కుంటున్నాయి. మరోవైపు యాత్రలో కీలకమైన గుండిచా మందిరం నిర్మాణ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రథయాత్ర నాటికి మందిరం పనులు జరుగుతాయా లేదా? అన్న అనుమానం కలుగు తోంది. దీనిపై దేవదాయశాఖ మేనేజర్‌ రామారావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. రథయాత్ర పూజలు కొనసాగుతాయని చెప్పారు. రథం బాగుచేసేందుకు పనివారు దొరకలేదన్నారు. అందుకే నిరూప యోగంగా ఉందని పేర్కొన్నారు. గత రెండేళ్లు మాదిరిగా తొమ్మిది రోజుల పాటు పూజలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 


Updated Date - 2022-06-26T05:39:05+05:30 IST