భారత్‌లో కనువిందు చేసిన బ్లూమూన్..!

ABN , First Publish Date - 2020-11-01T02:45:10+05:30 IST

వెన్నెల్లో గోదారి అందం, వెన్నెల్లో హాయ్.. మల్లెల్లో హాయ్‌హాయ్, నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి, వెన్నెలవే వెన్నెలవే...

భారత్‌లో కనువిందు చేసిన బ్లూమూన్..!

వెన్నెల్లో గోదారి అందం, వెన్నెల్లో హాయ్.. మల్లెల్లో హాయ్‌హాయ్, నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి, వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా.. ఇలా చెప్పుకంటూ పోతే వీలు చిక్కినప్పుడల్లా వెన్నెల అందాన్ని వర్ణించడానికి మన తెలుగు సినిమా గేయ రచయితలు తెగ ముచ్చటపడుతుంటారు. పల్లెటూరిలో పండు వెన్నెల్లో ఆ పాత మధురాలను వింటుంటే ఆ అనుభూతే వేరు. అంతటి చందమామ అందం మరింత అద్భుతంగా కనిపించేది ప్రకాశవంతంగా కనిపించేది పౌర్ణమి రోజున. అలాంటి పౌర్ణమి ఒకే నెలలో రెండోసారి వస్తే, పున్నమి వేళ చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తూ బ్లూమూన్‌లా మారితే చూపరులకు కనువిందే. అలాంటి అరుదైన దృశ్యమే నేడు రాత్రి 8 తర్వాత వినీలాకాశంలో ఆవిష్కృతమైంది.


మరిన్ని ఫొటోల కోసం క్లిక్ చేయండి


నీలి నింగిలో నిండు జాబిలి కనువిందు చేసింది. ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే దానిని 'బ్లూ మూన్'‌గా వ్యవహరిస్తుంటాం. సహజంగా ప్రతి నెలలో ఒక అమావాస్య, ఒక పౌర్ణమి వస్తుంటాయి. అసాధారణ సందర్భాల్లో ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వస్తుంటాయి. అక్టోబర్‌లో అలాంటి అసాధారణ సందర్భం చోటు చేసుకుంది. ఈనెలలో తొలి పౌర్ణమి 1-2 తేదీల్లో వచ్చింది. రెండో పౌర్ణమి ఈనెల 31న.. అంటే ఇవాళ రాత్రి కనిపించింది. భారత్‌లో ఇవాళ రాత్రి 8.19 నిముషాలకు చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించాడు. ఈ అరుదైన దృశ్యాన్ని ఎంతోమంది ప్రజలు ఆసక్తిగా తిలకించారు.





Updated Date - 2020-11-01T02:45:10+05:30 IST