Abn logo
Aug 13 2020 @ 17:56PM

‘బ్లూ ఐస్’ ట్రైలర్ విడుదలయ్యేది ఎప్పుడంటే..

డిజిటల్ వరల్డ్‌లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఎగబడి చూసేస్తున్నారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ వండి చిత్రాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి సినిమానే ఇది అంటున్నారు ‘బ్లూ ఐస్’ చిత్రయూనిట్. ఆఫ్రీన్ సిద్ధు, నాస్టియా రాయ్, నిశాంత్ వాలియా, ఆర్జే పృథ్వీ వంటి నటీనటులు నటించిన చిత్రం ‘బ్లూ ఐస్’. ఈ చిత్ర ట్రైలర్ ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. రాధా మాధవి ప్రొడక్షన్స్, రవళి చౌదరి సమర్పణలో మాదాల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రాజేష్ మూర్తి దర్శకుడు. సంగీతం ఎమ్. అనిరుధ్ అందించాడు. 


‘‘ట్రైలర్‌ రెడీ చేశాము. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నాము. ఇక ఈ థ్రిల్లర్‌లో స్నేహితురాలు దారుణమైన పరిస్థితులలో చనిపోయినట్లు తెలుసుకున్న రోహిత్ హంతకుడిని తెలుసుకోవడానికి మోనికా సహాయం తీసుకుంటాడు. ఆమె, ఒక మనోరోగ వైద్యుడితో కలిసి, దారుణ హత్య రహస్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సినిమాలో అసలు పాయింట్. సినిమాలో థ్రిల్లింగ్‌గా అనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇదివరకే కన్నడ రిలీజైన బ్లూ ఐస్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక తెలుగు ఆడియెన్స్‌ని కూడా థ్రిల్ చేయడానికి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..’’ అని నిర్మాత మాదాల రామకృష్ణ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement