ఊడిపడ్డ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ఇనుపకడ్డీ

ABN , First Publish Date - 2020-10-20T07:30:17+05:30 IST

ఐటీ కారిడార్‌ బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ప్లైఓవర్‌ కింది భాగంలోని చానల్‌ ఇనుపకడ్డీ సోమవారం ఊడి కిందున్న మరో ప్లైఓవర్‌పై పడింది

ఊడిపడ్డ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ఇనుపకడ్డీ

రాయదుర్గం, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి) : ఐటీ కారిడార్‌ బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద నిర్మించిన ప్లైఓవర్‌ కింది భాగంలోని చానల్‌ ఇనుపకడ్డీ సోమవారం ఊడి కిందున్న మరో ప్లైఓవర్‌పై పడింది. ఈ సమయంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దారిలో వెళ్తున్న ఓ వాహనదారుడు ఫొటోతీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-10-20T07:30:17+05:30 IST