మీరు చేసే ఈ 5 తప్పులు బ్లడ్ షుగర్‌ను పెంచేస్తాయి.. నియంత్రణకు ఏం చేయాలంటే..

ABN , First Publish Date - 2021-12-16T18:06:40+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్(మధుమేహం) రోగుల సంఖ్య..

మీరు చేసే ఈ 5 తప్పులు బ్లడ్ షుగర్‌ను పెంచేస్తాయి.. నియంత్రణకు ఏం చేయాలంటే..

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్(మధుమేహం) రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. భారతదేశంలో పెరుగుతున్న డయాబెటిక్ రోగుల సంఖ్యను గమనిస్తే.. దేశం డయాబెటిస్ రాజధానిగా మారిందని చెప్పవచ్చు. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మధుమేహ వ్యాధి నియంత్రణకు చాలా అవసరం. మధుమేహం అనేది నయం చేయలేని వ్యాధి. తీసుకునే ఆహారం, జీవనశైలి కారణంగా మధుమేహం వస్తుంది. వైద్య పరిభాషలో శరీరంలో చక్కెర శాతం పెరుగుదలను హైపర్గ్లైసీమియా అంటారు. ఈ వ్యాధి తలెత్తినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి అనియంత్రితంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది, ఫలితంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాలు ఫెయిల్ కావడం మొదలైన తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా మీరు మీ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవచ్చు. అయితే దీనికి ముందుగా మధుమేహానికి కారణంగా నిలిచేలా మనం చేసే ఐదు తప్పులేమిటో తెలుసుకుందాం.




అస్తవ్యస్తమైన జీవనశైలి: 

అస్తవ్యస్తమైన జీవనశైలికి కలిగినవారు తమ శరీరంలో అధికస్థాయిలో బ్లడ్ షుగర్‌ను కలిగివుంటారు. నిద్ర నుంచి ఆలస్యంగా మేల్కొవడం, లేటుగా నిద్రపోవడం లాంటి అలవాట్లు ఉన్నవారు వ్యాయామం చేయలేరు. అలాగే ఏదైనా పని చేసేందుకు ఇబ్బంది పడతారు. ఇటువంటివారి జీవనశైలి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇలాంటి వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

సరైన ఆహారం: 

చాలా మందికి ఆహారం తీసుకునే విషయంలో ఉదాసీన భావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్, లాంటి చెడు అలవాట్లకు బానిసలవుతుంటారు. శరీరంలో న్యూట్రీషియన్స్ లేకపోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు క్రమం తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.

ఊబకాయం, ఒత్తిడి: 

ఊబకాయం అనేక వ్యాధులకు కారణంగా నిలుస్తుంది. కొన్నిసార్లు ఊబకాయం అనేది రక్తంలో చక్కెరను పెంచడానికి కారణంగా నిలుస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా, కార్టిసాల్ అనే హార్మోన్లు విడుదలవుతాయి, ఇవి రక్తంలో చక్కెరను పెంచడానికి దోహదపడతాయి.

ఆహారం, వ్యాయామం: 

అధిక రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం చేయడం ద్వారా మీ శరీరం, మనస్సు ఆరోగ్యవంతంగా రూపొందుతాయి. 

ఇతర నివారణలు: 

మీరు మీ రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే, ముందుగా మీ బరువును అదుపు చేయండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఇంతేకాకుండా మీరు మీ బ్లడ్ షుగర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. పొట్లకాయ రసం, మెంతులు మొదలైనవి ఆహారంలో వినియోగించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. 

Updated Date - 2021-12-16T18:06:40+05:30 IST