Advertisement
Advertisement
Abn logo
Advertisement

రక్తదానమంటే ప్రాణదానం : కృష్ణారెడ్డి

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 4 : రక్తదానం అంటే ప్రాణదా నం చేసినట్టు అని ప్రతీ రెండు సెకన్లకు ఒకసారి దేశంలో ఎవరో ఒకరికి రక్తం అవసరం అవుతుందని రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి అన్నారు. జంగారెడ్డిగూడెంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాశాఖ ఆధ్వ ర్యంలో ఇన్‌స్పైర్‌ టు ఛేంజ్‌ గ్రూప్‌ వారి సాయంతో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరంలో 28 మంది రక్తదానం చేశారు. ప్రతీ ఒక్కరూ జీవితకాలంలో సుమారు 168 సార్లు రక్తదానం చేయవచ్చన్నారు. అనంతరం రక్తదానం చేసిన దాతలను అభినందించారు. రెడ్‌క్రాస్‌ కాంపోనెంట్‌ బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌కే వరప్రసాద్‌, ఇన్‌స్పైర్‌ టు చేంజ్‌ గ్రూపు ప్రెసిడెంట్‌ ఎం.నవీన్‌రెడ్డి, వైస్‌ప్రెసిడెంట్‌ కె.అఖిల్‌, కార్యదర్శి వి.సునీల్‌, ఆర్‌.భవాని, బ్లడ్‌ బ్యాంక్‌ కో–ఆర్డినేటర్‌ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement