వెలకట్టలేనిదే రక్తదానం

ABN , First Publish Date - 2022-08-18T04:30:07+05:30 IST

అన్ని దానా ల్లోకెళ్లా రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం చేసి న వారి సేవను వెలకట్టలేమని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు.

వెలకట్టలేనిదే రక్తదానం
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

- వజ్రోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

- ఉత్సాహంగా ముందుకొచ్చిన 

వివిధ శాఖల అధికారులు

- 81 యూనిట్ల రక్తం సేకరణ 

- ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌

వనపర్తి వైద్యవిభాగం, ఆగస్టు 17: అన్ని దానా ల్లోకెళ్లా రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం చేసి న వారి సేవను వెలకట్టలేమని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవా లను పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రం లోని రక్తనిధి కేంద్రంలో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ప్రారంభించారు. శిబిరంలో ముని సిపల్‌, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులు ఉత్సాహంగా పాల్గొని  81 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. స్వచ్ఛంద రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కృత్రిమంగా త యారు చేయలేనిది రక్తం కాబట్టి రక్తదానం చేయ డమంటే మరొకరికి ప్రాణాదానం చేయడమేనని అన్నారు. జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్క ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల కు కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, ముని సిపల్‌ కమిషనర్‌ విక్రమసింహరెడ్డి, మిషన్‌ భగీ రథ ఎస్‌ఈ జగన్‌ మోహన్‌, ఈఈ మేఘారెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో వెంకట్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవిశంకర్‌, మెడికల్‌ కాలేజ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రకుమార్‌, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డి, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ చైతన్యగౌడ్‌, తహసీల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, మునిసిపల్‌ ఏఈ భాస్కర్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ ఖాజా కుతుబుద్దీన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల కృష్ణసాగర్‌, కలాం పాషా  పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-18T04:30:07+05:30 IST