Abn logo
May 20 2020 @ 04:35AM

రక్తదానం చేయడం అభినందనీయం

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) మే 19 : సామాజిక స్పృహతో రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ లయన్‌ నటరాజ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెక్కం జనార్దన్‌ అన్నారు. సినీనటుడు జూనియర్‌ ఎ న్టీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమాన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ భవనంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.


కార్యక్రమానికి నటరాజ్‌, జనార్దన్‌ హాజరై మాట్లాడారు. అభిమానులం టే సామాజిక స్పృహ కూడా ఉండాలన్నారు. ఈ సందర్భంగా 150 మంది వర కు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.విజయ్‌కు మార్‌, జూనియర్‌ రెడ్‌క్రాస్‌ సమన్వయకర్త అశ్వినీ చంద్రశేఖర్‌, వైస్‌ ప్యాట్రాన్‌ రామకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫేరో జ్‌, ప్రధాన కార్యదర్శి వసుందర శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు యాదయ్య, రఘుగౌడ్‌, కొత్త గొల్లరాజు, బోయ రాజు, కుమ్మరి రాజు, మహేందర్‌, భాస్కర్‌, పేటశ్రీను, శివ, మహేశ్‌, సుభాశ్‌, నరేశ్‌, జయప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement