రక్తదానం అభినందనీయం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-20T06:02:12+05:30 IST

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే సంకల్పంతో రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు.

రక్తదానం అభినందనీయం: కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

బేల, అక్టోబరు 19: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే సంకల్పంతో రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. మంగళవారం బేల గణేష్‌ గార్డెన్‌లో మిలాద్‌ ఉన్‌ నబి పర్వదినాన్ని పురస్కరించుకుని మైనార్టీ యువకులు ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారిలో తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని ఆ సమయంలో బాధితులకు కాపాడుటకు రక్తం ఎంతో అవసరం ఉంటుందన్నారు. పండుగ రోజున రక్తదానం చేయడానికి పూనుకోవడం నేటి యువతరానికి ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే మండలంలో కరోనా వ్యాక్సినేషన్‌ 98శాతం పూర్తి చేయడం అభినందనీయమన్నారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ మాట్లాడుతూ మైనార్టీల సమస్యను పరిష్కారం కోసం ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా, గ్రంథాలయ చైర్మన్‌ మనోహర్‌, జిల్లా వైద్యాధికారి నరేందర్‌రాథోడ్‌, ప్రత్యేక అధికారి శంకర్‌, ఎంపీడీవో రవీందర్‌భగత్‌, తహసీల్దార్‌ రాంరెడ్డి, జడ్పీటీసీ అక్షిత పవార్‌, సర్పంచ్‌ ఇంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: అత్యంత పవిత్రమైన మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధానచౌక్‌ల గుండా ప్రత్యేక వాహనాల్లో ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2021-10-20T06:02:12+05:30 IST