పోలీస్‌ సిబ్బంది రక్తదానం అభినందనీయం

ABN , First Publish Date - 2021-10-29T04:49:10+05:30 IST

ప్రజల రక్షణ కోసం అహర్నిశలు విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సి బ్బంది రక్తదానం చేయడం అభి నందనీయమని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నా రు.

పోలీస్‌ సిబ్బంది రక్తదానం అభినందనీయం
రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న డీఐజీ, ఎస్పీ

ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు 

ఏలూరు క్రైం, అక్టోబరు 28: ప్రజల రక్షణ కోసం అహర్నిశలు విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ సి బ్బంది రక్తదానం చేయడం అభి నందనీయమని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నా రు. పోలీసు అమరవీరుల సంస్మ రణ వారోత్సవాల్లో భాగంగా ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపు, రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. అనం తరం డీఐజీ మాట్లాడుతూ జిల్లా పోలీస్‌ సిబ్బంది, హోం గార్డ్సు, స్మార్ట్‌సిటీ యోజన వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు అబ్బూరి అనిల్‌ రక్తదానం చేయడం ప్రశంసనీయమ న్నారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, పోలీస్‌ అధికారులు దృఢసంక్పలంతో 300 మంది సిబ్బంది రక్తదానం చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రక్తదానం చేసిన ఎస్సీ ఎస్టీ సెల్‌ డీఎస్పీ శుభాకర్‌ను, సిబ్బందిని అభినందించారు. పోలీస్‌ యూనిట్‌ వైద్యులు ఎ.పూజ, అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సి.జయరామరాజు, ఏఆర్‌ అదనపు ఎస్పీ రామకృష్ణ, రెడ్‌క్రాస్‌ చైౖర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి, రెడ్‌క్రాస్‌ వైద్యుడు ఆర్‌ఎస్‌ఆర్‌కే వరప్రసాద్‌, రెడ్‌క్రాస్‌ కార్యదర్శి కృష్ణారావు, ఏఆర్‌ డీఎస్పీ కృష్ణంరాజు, డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ ఎస్‌సీహెచ్‌ కొండలరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T04:49:10+05:30 IST